మేడ్చల్ బేకరీలలో ఇంత అధ్వానమా..! ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటే రోగాలు ఎందుకు రావూ..?

మేడ్చల్ బేకరీలలో ఇంత అధ్వానమా..! ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటే రోగాలు ఎందుకు రావూ..?

బయట ఫుడ్ తినే అలవాట్లు రోజు రోజుకూ ఎంతలా పెరుగుతున్నాయో.. వ్యాపారుల్లో అత్యాశ అంతకు మించి డబుల్ త్రిబుల్ అవుతోంది. సంపాదనే లక్ష్యంగా తక్కువ ధరలో ఎక్కువ లాభం అన్నట్లుగా.. ఏ గడ్డి పెట్టినా తింటారులే అన్న ధోరణిలో జనాల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. మేడ్చల్ లో ఈ బేకరీ పరిస్థితి చూస్తే 100 శాతం నిజమని మీరే చెబుతారు.

మేడ్చల్ జిల్లా తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో బేకరీ పై సోమవారం (జూన్ 29) ఎస్వోటీ పోలీసుల దాడి చేశారు. బేకరిలోకి ఎంట్రీ అయిన పోలీసులు.. అక్కడున్న ఆహార పదార్థాలు , వాటి తయారీ విధాంన చూసి షాకయ్యారు. గడువు ముగిసిన పదార్థాలు, సింథటిక్ రంగులు ఉపయోగిస్తూ పట్టుబడ్డారు. 

క్యాన్సర్ కారకాలుగా రూపాంతరం చెందే సింథటిక్ కలర్స్ వాడొద్దనే నిషేధం ఉన్నా.. విచ్చలవిడిగా వాడుతుండటం ఆందోళన కలిగించే అంశం.  ఎలాంటి లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న బేకరీపై దాడి చేసిన పోలీసులు.. కీలక ఆధారాలను సేకరించారు.

మజీద్‌పూర్‌లో ఉన్న ఎంసీఅర్ బేకరీపై దాడి చేశారు పోలీసులు. బేకరీ నిర్వహకులు బోడా ఆనంద్, బోడా సౌజన్యలను  అదుపులోకి తీసుకున్నారు. ట్రేడ్, ఫుడ్ లైసెన్స్ లేకుండానే బేకరీని నడుపుతున్నట్లు గుర్తించారు. 

ALSO READ : వరంగల్ హైవేపై రాత్రుల్లో ఫ్యామిలీతో వెళ్తున్నారా.. ?

గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగించి బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు . అలాగే సింథటిక్ రంగులు, వివిధ రకాల ఫ్లేవర్లు కలుపుతున్నట్లు తనిఖీల్లో తేలింది. 
బేకరీపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం కేసును జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.