ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభం

ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభం

ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి (హై లెవల్ కమిటీ) కమిటీ విచారణ ప్రారంభించింది. ఘటనపై ఎలాంటి సమాచారం ఉన్నా రైల్వేకు తెలియజేయాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ప్రమాదంపై ఏమైనా అనుమానం, సాక్ష్యాలు ఉంటే తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ సంచాలన్ భవన్ కు జులై 10, 11 తేదీల్లో వచ్చి వివరాలు ఇవ్వొచ్చని చెప్పింది. 

మరోవైపు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ మంటలపై అధికారుల దర్యాప్తు చేపట్టారు. ముందు ఎస్‌-4 బోగీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని, మంటలు నిమిషాల్లోనే ఇతర బోగీలకు వ్యాపించినట్లు క్లూస్‌ టీమ్‌ భావిస్తోంది. హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తుండగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి, బొమ్మాయిపల్లి మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం (జులై 7న) మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ముందుగా ఎస్ 4 కోచ్ టాయిలెట్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. తర్వాత వేగంగా పక్కనే ఉన్న బోగీలకు మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు.