Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్

Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్

హీరో ప్రభాస్(Prabhas) ఇన్ స్ట్రాలో ఓ పోస్ట్ చేశారు.. అందులో అర్థం మాత్రం వెరీ వెరీ డిఫరెంట్ గా ఉంది.. సినిమాల గురించి అయితే పర్సనల్ టచ్ ఉండదు కదా అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ప్రభాస్ పోస్ట్ సారాంశం ఏంటో తెలుసా..  డార్లింగ్స్.. మా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు.. వెయింట్ చేయండి అని ప్రభాస్ చెప్పాడు. దీంతో కాబోయే భార్యను పరిచయం చేస్తున్నాడా? అంటూ సోషల్ మీడియా రకరకాలుగా గుసగుసలాడుకుంటుంది.

నిజానికి.. ప్రభాస్ పెళ్లిపై చాలా రోజులుగా.. చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో మా జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారంటూ ప్రభాస్ ఇచ్చిన హింట్.. పెళ్లి గురించే అనే టాక్ సినీ ఇండస్ట్రీలో బలంగా నడుస్తుంది. ఈ ఒక్క పోస్ట్ తో ఆడియన్స్ అందరినీ డైలామాలో పేడేశాడు ప్రభాస్. దీంతో.. అన్నా ఈ ట్విస్ట్ ఏంటన్నా? తొందరగా చెప్పన్నా.. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. మా డార్లింగ్ ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. మనం ఏమనుకున్నా అసలు విషయం తెలియాలంటే.. ప్రభాస్ ఆ ట్విస్ట్ రివీల్ చేసేవరకు ఆగాల్సిందే.