తాటి చెట్టుపై చిక్కుకుండు.. 8 గంటలు శ్రమించి క్రేన్​తో దింపిన్రు

తాటి చెట్టుపై చిక్కుకుండు.. 8 గంటలు శ్రమించి క్రేన్​తో దింపిన్రు
  •     8 గంటలు శ్రమించి క్రేన్​తో కిందికి దింపిన పోలీసులు

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌/సంస్థాన్ నారాయణపురం, వెలుగు: కల్లు తీయడానికి తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారి చెట్టుపై తల కిందులుగా వేలాడాడు. సుమారు 8 గంటలు తాటిచెట్టుపైనే తలకిందులుగా అవస్థలు పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన  బాలగోని మాసయ్య(56) శుక్రవారం ఉదయం తాటి కల్లు తీయడానికి చెట్టు ఎక్కాడు.

చెట్టుపైకి ఎక్కగానే కాలు జారింది. కాళ్లకు మోకు తట్టుకొని తలకిందులయ్యాడు. చెట్టు పైనుంచి కేకలు వేయడంతో గమనించిన చుట్టుపక్కల గీత కార్మికులు కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మొదట తాడు నడుంకి కట్టి దింపడానికి ప్రయత్నం చేసినా కుదరలేదు. చివరకు సాయంత్రం 4 గంటలకు క్రేన్ సహాయంతో కిందికి దింపారు. అప్పటికే మాసయ్య స్పృహ తప్పడంతో హాస్పిటల్ కు తరలించారు.