ఆధార్ లేకుండానే జీవన్ ప్రమాణ్ 

ఆధార్ లేకుండానే జీవన్ ప్రమాణ్ 

డిజిటల లైఫ్ సర్టిపికెట్ అయిన జీవన ప్రమాణ్ ను పొందడానికి ఇక నుంచి పెన్షనర్లు ఆధార్ ను తప్పని సరిగా ఇవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆధార్ వెరిఫికేషన్ ను ఆప్షనల్ గా మార్చింది. దీంతో పాటు ప్రభుత్వ మెసేజింగ్ యాప్ ‘సందేశ్ ’ వెరిఫిన్ లో, పబ్లిక్ ఆపీసులలో అటెండెన్స్ నిర్వాహణలో  కూడా ఆధార్ బేస్డ్ వెరిఫికేషన ను ఆప్షన్ గా గవర్నమెంట్ మార్చింది. గతంలో లైఫ్ సర్టిఫికెట్ ను పొందడానికి ఆఫీసర్ల చుట్టూ పెన్షనర్లు తిరిగే వారు. ఈ  ఇబ్బందులను  తగ్గించేందుకు ప్రభుత్వం డిజిటల్ గానే లైఫ్ సర్టిఫికెట్లను 2014 నుంచి ఇవ్వడం ప్రారంభించింది. జీవన్ ప్రమాణ్ స్కీం కింద లైఫ్ సర్టిఫికెట్లు పొందాలంటే ఆధార్ తప్పని సరిగా అవసరం. తమ వద్ద ఆధార్ కార్డులు లేవని, ఫింగర్ ప్రింట్ లు ఇప్పుడు మ్యాచ్ కావడం లేదని చాలా మంది పెన్షనర్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీన్ని దృషిట్లో పెట్టుకుని ఆధార్ కార్డు వెరిఫికేషన్ ను వాలంటరీగా మార్చింది.