అందుకే బ్రేక్ తీసుకుంటున్నా : ఆమీర్‌‌‌‌ ఖాన్‌‌

 అందుకే బ్రేక్ తీసుకుంటున్నా  :  ఆమీర్‌‌‌‌ ఖాన్‌‌

సాధారణంగా కెరీర్‌‌‌‌ ఫామ్‌లో ఉన్నప్పుడు గ్యాప్‌‌ తీసుకోవాలని ఏ స్టార్ హీరో కోరుకోడు. కొత్త సినిమాలు స్టార్ట్ అవడం ఆలస్యమవడంతో ఒక్కోసారి గ్యాప్ వస్తుంటుంది. కానీ ఆమీర్‌‌‌‌ ఖాన్‌‌ మాత్రం కావాలనే కెరీర్‌‌‌‌లో బ్రేక్ తీసుకుంటున్నా అని ప్రకటించారు. ఒక్కో షాట్‌‌ పర్ఫెక్ట్‌‌గా రావడానికి ఎంతో కేర్‌‌‌‌ తీసుకుంటూ, ఒక్కో సినిమాకు కొన్నేళ్ల పాటు కష్టపడుతుంటారు ఆమీర్‌‌‌‌. అయితే ఇటీవల ‘లాల్‌‌ సింగ్‌‌ చద్దా’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ సినిమా కంటే ముందు చేసిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌‌’ కూడా డిజాస్టర్‌‌‌‌గానే నిలిచింది. అలాగని తను కెరీర్‌‌‌‌లో బ్రేక్ తీసుకోవడానికి ఈ ప్లాపులు కారణం కాదంటున్నారు.

‘కెరీర్ స్టార్ట్ చేసి 35 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లలో ఏదో నష్టపోయానని వెలితిగా ఉంది. నిరంతరం పని గురించే ఆలోచించడం సరైనది కాదనిపిస్తోంది. సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని మా అమ్మ, పిల్లలతో గడపాలనుకుంటున్నా. అందుకే ఏడాదిన్నర పాటు కెమెరా ముందుకు రాకూడదు అనుకుంటున్నా’ అని చెప్పారు ఆమీర్. ఇక తను నటిస్తూ, సోనీ పిక్చర్స్‌‌తో కలిసి నిర్మించనున్న  ‘ఛాంపియన్స్‌‌’ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. అందులో తాను నటించకపోయినా మరో స్టార్‌‌‌‌ హీరోతో దాన్ని నిర్మిస్తానని చెప్పారు.