
ఆరోగ్యసేతు యాప్ లో లోపాలు కనిపెడితే బంపర్ రివార్డ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 3 భద్రతా పరమైన అంశాల్లో లోపాలు కనిపెడితే.. ఒక్కో అంశానికి లక్ష రూపాయల చొప్పున.. రూ.3 లక్షల బహుమతులు ఇవ్వనున్నట్టు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ డైరెక్టర్ జనరల్ …నీతా వర్మ అనౌన్స్ చేశారు. మంగళవారం ఆరోగ్యసేతు యాప్ ఓపెన్ సోర్స్ కోడ్ ను …కేంద్రం విడుదల చేసింది. కోడ్ మెరుగుదలకు మంచి సూచనలు చేసినవారికి కూడా బహుమతి ఇస్తామన్నారు నీతా వర్మ.
ఆరోగ్యసేతు యాప్ ను పూర్తిగా ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫాంగా అభివృద్ధి చేశామని తెలిపిన ఆమె.. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈపాస్ జారీ చేస్తే అది ఈ యాప్ తో అనుసంధానం అవుతుందని, ప్రత్యేకంగా కాపీ పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఏప్రిల్ 2న ఆరోగ్య సేతు యాప్ ను కేంద్రం ప్రారంభించగా.. ఇప్పటి వరకూ దీనిని 11.2 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. దీని సోర్స్ కోడ్ గిట్ హబ్ లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత అందుబాటులోకి వచ్చింది.
For More News..