RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారంటే..!

RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారంటే..!

RCB vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ బెంగళూరులో ఈరోజు (2026, మార్చి 28న) చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ మధ్య జరగనున్న ఈ పోరు క్రికెట్ అభిమానులకు అసలైన విందును అందించనుంది. గతేడాది టైటిల్ గెలిచిన జోష్‌లో RCB ఉంటే, గత సీజన్‌లో 6వ స్థానంతో సరిపెట్టుకున్న SRH ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోంది.

పిచ్ రిపోర్ట్: 
చిన్నస్వామి స్టేడియం అంటేనే బౌలర్లకు పీడకల.. ఇక్కడి మైదానంలో చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్ కారణంగా భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది.

టాస్ కీలకం: 
మార్చి నెలలో ఇక్కడ (బెంగళూరు) మంచు  ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు కళ్లు మూసుకుని బౌలింగ్ ఎంచుకుంటుంది.

టార్గెట్: 
ఈ పిచ్‌పై 200+ పరుగులు కూడా సేఫ్ కాదు.. ఛేజింగ్ చేసే జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

కీలక ఆటగాళ్లు: 
విరాట్ కోహ్లీ: చిన్నస్వామి స్టేడియం 'కింగ్' కోహ్లీకి సొంత ఇల్లు లాంటిది.. ఓపెనర్‌గా అతను ఇచ్చే ఆరంభంపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.

►ALSO READ | SRH vs RCB హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. 

అభిషేక్ శర్మ: ప్రస్తుతం టీ20ల్లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ గా అభిషేక్ కొనసాగుతున్నాడు. పవర్‌ప్లేలో ఇతను, ట్రావిస్ హెడ్ గనుక చెలరేగితే మ్యాచ్ ఏకపక్షం అయిపోతుంది.

ప్లేయింగ్ XI అంచనా: 


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ. (ఇంపాక్ట్ ప్లేయర్: మంగేష్ యాదవ్)

సన్‌రైజర్స్ హైదరాబాద్: 
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషాన్ అన్సారీ, శివం మావి. (ఇంపాక్ట్ ప్లేయర్: అనికేత్ వర్మ)

హెడ్-టు-హెడ్ రికార్డ్: 
మొత్తం మ్యాచ్‌లు: 26
ఆర్సీబీ విజయం: 11
ఆరెంజ్ ఆర్మీ విజయం: 14
ఫలితం తేలనివి: 1
గణాంకాల పరంగా చూస్తే SRH స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తుంది, చిన్నస్వామి స్టేడియంలో RCBని ఓడించడం ఎవరికైనా సవాలే అని చెప్పాలి.

విజేత ఎవరు?: 
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ అత్యంత భయంకరంగా ఉంది.. వాళ్లు 220+ స్కోరు చేసే సామర్థ్యం కలిగి ఉన్నారు. కానీ, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, ఛేజింగ్ చేసే అవకాశం ఉండటం వల్ల ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.