SRH vs RCB హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. 

SRH vs RCB హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. 

SRH vs RCB: క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ రానే వచ్చేసింది. ఈరోజు (2026, మార్చి 28న) నుంచి క్రికెట్ పోరు స్టార్ట్ కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ -సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ కీలక పోరు కొనసాగనుంది. ఇక ఇప్పటికే ఈ జట్లు మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. గతేడాది ట్రోఫీని కైవసం చేసుకుని ఉత్సాహంతో ముందుకు సాగుతున్న ఆర్సీబీ.. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని టార్గెట్ పెట్టుకుంది ఆరెంజ్ ఆర్మీ. ఈ తరుణంలో ఎస్ఆర్హెచ్ VS ఆర్సీబీ హెడ్ టు హెడ్ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన అన్ని మ్యాచులు ఎంతో ఉత్కంఠభరితంగా సాగాయి. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మొత్తం 26 సార్లు పోటీ పడ్డాయి. వీటిలో హైదరాబాద్ 14 మ్యాచ్లు గెలవగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచులలో విజయం సాధించింది. ఇందులో ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ లెక్కలు చూస్తే ఇప్పటి వరకు గెలుపులో ఎస్ ఆర్ హెచ్ దే పైచేయి సాధించింది. ఇదిలా ఉండగా.. 2024 ఎడిషన్ లో హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ పై కేవలం 30 బంతుల్లోనే 100 పరుగులు చేయడంతో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. గత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ, ఆర్సీబీ తలపడినప్పుడు, ఎస్ఆర్ హెచ్ 231 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్ ఆర్సీబీ 42 పరుగుల తేడాతో ఓడింది. కానీ ఆ తర్వాత ఆర్సీబీ జట్టు అద్భుతంగా పుంజుకుని తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. 

►ALSO READ | IPL 2026: గుడ్ న్యూస్.. బంగ్లాదేశ్‎లో ఐపీఎల్‎ ప్రసారాలపై నిషేధం ఎత్తివేత

అయితే.. ఈ ఏడాది మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరింత బలంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, జోర్డాన్ కాక్స్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లు ఈజీగా మ్యాచ్ స్వరూపనే మార్చేయగల పవర్ వీరికి ఉంది. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఈ జట్టు వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆరంభ మ్యాచ్‌కు ఆర్సీబీ, సన్‌రైజర్స్ జట్ల తమ టాప్ బౌలర్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. గాయాల కారణంగా జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా, యశ్ దయాల్ లేకపోవడంతో ఆర్సీబీ మంగేశ్ యాదవ్‌ని తుది జట్టులోకి తీసుకుంది. సన్‌రైజర్స్ మాత్రం హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఈషాన్ మలింగ, హర్ష్ దూబే‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది.