ఆకతాయిల ఆట కట్టించేందుకు టెన్త్ స్టూడెంట్గా మారిన టేకుమట్ల SI

ఆకతాయిల ఆట కట్టించేందుకు టెన్త్ స్టూడెంట్గా మారిన టేకుమట్ల SI

టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో SI అమూల్య విద్యార్థినిగా మారారు. పదవతరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఆకతాయిల భరతం పట్టేందుకు విద్యార్థిని గెటప్తో టేకుమట్ల SI అమూల్య రంగంలోకి దిగారు. ఎగ్జామ్ ప్యాడ్తో స్టూడెంట్ మాదిరిగా సివిల్ డ్రెస్లో విద్యార్థినులతో కలిసి సెంటర్ నుంచి SI బయటకు వచ్చారు.

విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ అరికట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరైనా పరీక్ష కేంద్రాల దగ్గర ఈవ్ టీజింగ్, వేధింపులు, అనుచిత ప్రవర్తనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని SI అమూల్య హెచ్చరించారు.

►ALSO READ | లెమన్ అండ్ స్పూన్ గేమ్ లో.. మంత్రి కొండా సురేఖకు ఫస్ట్ ప్రైజ్

పరీక్ష కేంద్రాల దగ్గర విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకే ఇలా స్టూడెంట్లా విద్యార్థుల్లో కలిసిపోయానని SI అమూల్య చెప్పారు. SI అమూల్య స్టూడెంట్ గెటప్ దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. పోలీసులు ఏ రూపంలోనైనా పక్కనే ఉంటారని ఈ ఘటన ఉదాహరణ అని స్థానికులలో చర్చ జరిగింది.