మైనింగ్ అక్రమాల ఇష్యూ సీబీఐకి అప్పగించేందుకు రెడీ: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

మైనింగ్ అక్రమాల ఇష్యూ సీబీఐకి అప్పగించేందుకు రెడీ: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

హైదరాబాద్: ప్రతిపక్ష బీఆర్ఎస్ కోరితే రాష్ట్రంలో జరిగిన మైనింగ్ అక్రమాల వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హౌస్ కమిటీల పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆదివారం (మార్చి 29)  అసెంబ్లీలో మైనింగ్‎పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనింగ్ అక్రమాలపై విచారణకు ఆదేశించాం.. గత 12 ఏళ్ల మైనింగ్ దోపిడీపై సీఐడీ విచారణ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మైనింగ్ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. 

రేవంత్ స్పీచ్ లోని కీలక అంశాలు:

  • రాఘవ కన్ స్ట్రక్షన్స్‎కు మేం ఇచ్చిన నోటీసునే బీఆర్ఎస్ ప్రస్తావించింది
  • మేం ఇచ్చిన నోటీసునే ప్రస్తావించి బీఆర్ఎస్ సభలో హడావుడి చేస్తుంది
  • గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 3 హౌస్ కమిటీలు వేసింది
  • హౌస్ కమిటీల నివేదికలను బయటపెట్టకుండా వాటి ద్వారా బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు దోచకున్నరు
  • రాఘవ కన్ స్ట్రక్షన్స్‎తో పాటు 2014 వరకు జరిగిన మైనింగ్ లావాదేవీలపై సీబీ సీఐడీ విచారణకు ఆదేశించాం
  • మా పార్టీ నేతలు తప్పు చేసి ఉంటే సీఐడీ విచారణకు ఎందుకు ఆదేశిస్తాం
  • సీఐడీ విచారణ ఆదేశాల తర్వాత కేసీఆర్ కుటుంబంలో తగాదా
  • కేటీఆర్ వల్ల ఇబ్బందుల్లో పడ్డానని హరీష్ రావు గొడవపడ్డాడు
  • హౌస్ కమిటీ స్పీకర్ కు మాత్రమే నివేదిక ఇస్తుంది.. ఎవరినీ శిక్షించలేం
  • సీఐడీ విచారణ నివేదికతోనేతే  చర్యలు తీసుకోగలం
  • బీఆర్ఎస్ కు సీఐడీ విచారణపై నమ్మకం లేకపోతే సీబీఐ విచారణకు కూడా సిద్ధం
  • బీఆర్ఎస్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు