దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్, హ్యుందాయ్ మోబిస్, అపాక్ట్, శాంసంగ్, ఎల్జీ కెమ్ వంటి అంతర్జాతియ సంస్థల అధినేతలతో వరుసగా భేటీ అయ్యారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్ నగరంలో ప్రధాన పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణల కేంద్రమైన ప్రతిష్టాత్మక మాగోక్ సైన్స్ పార్క్ ను సందర్శించారు లోకేష్. ఈ క్రమంలో శాంసంగ్ సీనియర్ డైరెక్టర్ హెలెనా పార్క్ తో భేటీ అయిన లోకేష్ ఏపీలో డిస్ ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఐఎస్‌ఎం 2.0, స్పెషల్ సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ ద్వారా మద్దతిస్తామన్నారు లోకేష్. ఫుల్ ఏఐ-కంప్యూట్ స్టాక్ కోసం ఏపీని శాంసంగ్ కేంద్రంగా మార్చాలని కోరారు లోకేష్. ఏపీలో ఏఐ రెడీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు అభివృద్ధి చేయాలని... ఏఐ సర్వర్ తయారీని స్థానికీకరించి, లోకల్ సర్వర్ సర్వీసింగ్ హబ్ పెట్టాలని అన్నారు.
విశాఖలోని క్లస్టర్ కేంద్రంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయాలని... మొబైల్స్ కోసం ఓఎస్‌ఏటీ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని కోరారు లోకేష్. ఏపీలో మొబైల్, డివైసెస్ బ్యాటరీ కేంద్రం ఏర్పాటు చేయాలని... శాంసంగ్ ఆర్‌అండ్‌డీ విభాగాన్ని అమరావతి క్వాంటం వ్యాలీలోకి తీసుకురావాలని కోరారు లోకేష్.
