టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నందిని రెడ్డి నెట్టింట పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్జిత్ దోసాంజ్ లీడ్ రోల్‌లో నటించిన రియల్ లైఫ్ హార్డ్ హిట్టింగ్ మూవీ 'సత్లుజ్' (Satluj) . అయితే ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) సడెన్ గా డిలీట్ చేయడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమంతతో 'మా ఇంటి బంగారం' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నందిని రెడ్డి.. ఇప్పుడు ఈ పంజాబ్ పొలిటికల్ డ్రామాకు సపోర్ట్ గా నిలబడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నిజాలు చెప్పే స్వేచ్ఛ లేదా?
హనీ ట్రెహాన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను మొదట 'పంజాబ్ 95' టైటిల్ తో అనౌన్స్ చేశారు. ఎన్నో సెన్సార్ అడ్డంకులు దాటి జూలై 5న 'సత్లుజ్' పేరుతో జీ5 లో రిలీజ్ చేశారు. కానీ స్ట్రీమింగ్ కి వచ్చిన రెండు రోజులకే ఈ మూవీని ఇండియాలో బ్యాన్ చేస్తూ యాప్ నుంచి తీసేశారు. ఈ ఇష్యూ పై నందిని రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. సినిమాకు బహిరంగ మద్దతు తెలుపుతూ చేసిన కీలక వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అద్భుతమైన ఈ సినిమాను చూడటం మొదలుపెట్టా. కానీ అందులోని నిజాలు చూసి తట్టుకోలేక చివరి 30 నిమిషాల ముందు బ్రేక్ తీసుకున్నాను. మరుసటి రోజు చూద్దాం అనుకునేలోపే సినిమాను బ్యాన్ చేశారు. అప్పుడే మొత్తం చూసుంటే బాగుండేది. మనకు బాధపెట్టే నిజాలను చెప్పుకునే స్వేచ్ఛ లేకపోతే.. ఇక ఫ్రీడమ్ కు అర్థం ఏముంది? అని వ్యవస్థను ప్రశ్నించారు.
సెలబ్రిటీల మద్దతు.. లీకైన పైరసీ కాపీలు!
కేవలం నందిని రెడ్డే కాదు.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, రామ్ గోపాల్ వర్మ సైతం ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు. 'ఒక సినిమాను ఎంత ఎక్కువ నిషేధిస్తే.. జనాభాకు దానిపై అంత క్యూరియాసిటీ పెరుగుతుంది' అని అనురాగ్ కశ్యప్ కామెంట్ చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇలాంటి సినిమాలపై చర్చ జరగాల్సిందేనని వ్యాఖ్యానించారు.
Just saw SATLUJ and it is not a film , but a deep wound that will never heal. It stirs up the sludge in one of the darkest chapters of our history
— Ram Gopal Varma (@RGVzoomin) July 7, 2026
This is cinema used as confrontation , where @diljitdosanjh acts with a quiet fury with no chest thumping heroism.. His only weapons…
మరోవైపు, జీ5 అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో సినిమా అందుబాటులో ఉండదని, చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. అదే సమయంలో సినిమా పైరసీ కాపీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో వాటిని చూడొద్దని, షేర్ చేయొద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది.
We are hopeful and doing everything we can. Please do not support piracy. We remain committed to exploring every possible avenue to bring Satluj back to you. 🙏#Satluj pic.twitter.com/oHlxHMaa99
— ZEE5Official (@ZEE5India) July 6, 2026
అసలు ఈ సినిమా కథ ఏంటి?
హీరో దిల్జిత్ దోసాంజ్ ఈ బ్యాన్‌ను ముందే ఊహించి, ఫ్యాన్స్ ను ఎక్కడైనా సరే డౌన్‌లోడ్ చేసుకుని చూడమని చెప్పడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ సినిమాలో ఏముందంటే.. ఇది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖాల్రా రియల్ లైఫ్ స్టోరీ. 1990ల కాలంలో పంజాబ్ పోలీసులు ఫేక్ ఎన్‌కౌంటర్లు చేసి, సుమారు 25 వేల మంది అనాథ శవాలను అక్రమంగా దహనం చేశారనే ఆరోపణల వెనుక ఉన్న చీకటి నిజాలను ఆయన ప్రపంచానికి బయటపెట్టారు.
ఆ తర్వాత ఆయనే స్వయంగా కిడ్నాప్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక, సంచలన నిజాల చుట్టూనే 'సత్లుజ్' సినిమాను తెరకెక్కించారు. ఈ పవర్ ఫుల్ నిజాలు ఓటీటీల ద్వారా దేశవ్యాప్తంగా అందరికీ ముందే తెలిసిపోవడంతోనే ఈ సినిమాను తొలగించారనే టాక్ నడుస్తోంది.
