ఏం స్కెచ్ రా బాబు...! సాయం చేయడం కూడా పాపమేనా...! రూ. లక్ష ఫోన్ ఎలా కొట్టేశాడో చుడండి...!

ఏం స్కెచ్ రా బాబు...! సాయం చేయడం కూడా పాపమేనా...! రూ. లక్ష ఫోన్ ఎలా కొట్టేశాడో చుడండి...!

కలికాలం అంటే ఇదేనేమో... సాయం చేయడం కూడా తప్పే అవుతోంది. బైక్ మీద నుండి కిందపడబోతున్న వ్యక్తిని చూసి సాయం చేసేందుకు వెళ్తే అతని ఫోన్ కొట్టేశారు కేటుగాళ్ళు. ఎవరికీ దొరకకుండా మంచి స్కెచ్ అయితే వేశారు కానీ... సీసీటీవీ కెమెరా కంటికి చిక్కారు దుండగులు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

ఇద్దరు వ్యక్తులు ఒక ఫేక్ యాక్సిడెంట్ డ్రామా ఆడి... అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి నుండి ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను దొంగలించారు. నిమిషం లోపే జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రూ. లక్ష ఫోన్ ఇలా కొట్టేశారు...

బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుని రోడ్డు దాటుతున్న వ్యక్తి వైపు వెళ్ళాడు. బైక్ కంట్రోల్ తప్పి కింద పడుతున్నట్లు నటించాడు. అది గమనించిన వ్యక్తి సాయం చేసేందుకు వెళ్ళాడు. అంతే... పక్క నుంచి వచ్చిన మరో కేటుగాడు ఆ వ్యక్తి తెలియకుండా జేబులో నుంచి ఫోన్ కొట్టేశాడు. ఆ  తర్వాత బైక్ ఎక్కి ఇద్దరు చక్కగా ఉడాయించారు. తన ఫోన్ ఫోన్ పోయిందని గమనించే లోపే ఉడాయించారు కేటుగాళ్లు. సాయం చేద్దామని పోయి ఖరీదైన ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి లబోదిబోమన్నాడు. 

ఈ వీడియోకు పలు రకాల కామెంట్లతో స్పందిస్తున్నారు నెటిజన్స్. ఈ రోజులో సాయం చేయడం కూడా పాపం అయిపోయింది.. ఎవరినీ నమ్మకూడదు అంటూ కొంతమంది కామెంట్ చేయగా...ఇలాంటి ఘటనల వల్ల అపరిచుతులకు సాయం చేయడం మానేయాల్సి వస్తుందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కేటుగాళ్ల వల్ల నిజంగా అవసరంలో ఉన్నోళ్లకు సాయం అందదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.