జనగామ జిల్లాలో ఘోరం: మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్... ఇద్దరు మృతి

జనగామ జిల్లాలో ఘోరం: మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్... ఇద్దరు మృతి

జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. మంగళవారం ( జులై 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జరిగింది ఈ ఘటన. పాలకుర్తి నుండి స్టేషన్ ఘన్ పూర్ కు వెళ్తున్న కారు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా పాలకుర్తిలో ఒకరు, గూడూరులో ఒకరు మృతి చెందారు.

పాలకుర్తిలో మృతి చెందిన వ్యక్తి పెంతల లక్ష్మిగా... గూడూరులో మృతి చెందిన వ్యక్తి కిష్టాజి గూడెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.