బ్యూటిఫుల్  బటర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై

బ్యూటిఫుల్  బటర్‌‌‌‌‌‌‌‌ ఫ్లై

ఒక నటిలోని టాలెంట్ పూర్తిగా బయటికి రావాలంటే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌‌ చేయాలి అంటుంటారంతా. అందుకే హీరోయిన్లు కూడా అలాంటి చిత్రాలు రావాలని కోరుకుంటూ ఉంటారు. అనుపమా పరమేశ్వరన్‌‌కి ఆ చాన్స్ ఇప్పుడు వచ్చింది. గంటా సతీష్‌‌బాబు డైరెక్షన్‌‌లో రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లమెల్లి నిర్మిస్తున్న ఆ చిత్రానికి ‘బటర్‌‌‌‌ ఫ్లై’ అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేసినట్లు నిన్న అనుపమ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్‌‌ని కూడా వదిలారు. ఈ పోస్టర్‌‌‌‌లో చేతులు కట్టుకుని నిలబడి ఏదో ఆలోచిస్తోంది అనుపమ. వెనుక గోడపై రంగురంగుల రెక్కలు ఉన్నాయి. ఇది యూత్‌‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కి కూడా కనెక్టయ్యే సినిమా అని, త్వరలో మిగతా వివరాలు ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. అనుపమ నటిస్తున్న 18 పేజెస్, కార్తికేయ 2 టీమ్స్​ కూడా స్పెషల్‌ పోస్టర్స్​తో ఆమెకి  బర్త్‌ డే విషెస్ చెప్పాయి.