2030 నాటికి రెండింతలు చేయాలని ప్లాన్స్

2030 నాటికి రెండింతలు చేయాలని ప్లాన్స్
  • కెపాసిటీని రెండింతలు చేస్తామని వెల్లడి

న్యూఢిల్లీ: అంబుజా సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏసీసీలకు ఓనర్ అయిన అదానీ గ్రూప్ తమ సిమెంట్ తయారీ సామర్ధ్యాన్ని  2030 నాటికి రెండింతలు చేయాలని ప్లాన్స్ వేస్తోంది.  ప్రస్తుతం అదానీ గ్రూప్ సిమెంట్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ సామర్ధ్యం ఏడాదికి 7 కోట్ల టన్నులుగా ఉంది. దీన్ని 14 కోట్లకు పెంచాలని కంపెనీ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. సిమెంట్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీలో నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌గా ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్‌‌‌‌‌‌‌‌తో  పోటీ పడాలని అదానీ గ్రూప్ చూస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ సామర్ధ్యం ప్రస్తుతం 12 కోట్ల టన్నులుగా ఉండగా, దీన్ని 2030 నాటికి 16 కోట్ల టన్నులకు పెంచుకోవాలని ఈ కంపెనీ ప్లాన్స్ వేసింది. ఇండియాలో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఫలితంగా సిమెంట్ వాడకం పెరుగుతుందని అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. సిమెంట్ తయారీలో ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌ పొజిషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పటికీ దేశంలో సిమెంట్ పెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాపిటా వినియోగం కేవలం 250 కిలోలేనని అన్నారు. చైనాలో ఇది 1,600 కిలోలుగా ఉందని వివరించారు. తమ గ్రూప్ కంపెనీల ఆపరేషనల్ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి చూస్తున్నామని, సిమెంట్ బిజినెస్ దీని నుంచి కూడా లాభపడుతుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.