ఏరోబిక్స్ తో బ్రెయిన్ షార్ప్ గా

ఏరోబిక్స్ తో బ్రెయిన్ షార్ప్ గా

వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. అయినా రెగ్యులర్​గా చేయడంలో చాలామంది ఫెయిల్​ అయితుంటారు. ముఖ్యంగా వ్యాయామంలో చాలా రకాలుంటాయి. అలాంటప్పుడు… ఎవరికి నచ్చినదాన్ని వాళ్లు ప్రాక్టీస్​ చేస్తూ ఉండటం మంచిది. వాటిలో ఈజీగా అలవాటయ్యే వ్యాయామం.. ఏరోబిక్స్​.

ఏరోబిక్స్​లో ఉండే రకరకాల వర్కవుట్స్​.. ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. వీటిని ఎంజాయ్​ చేస్తూ అలవాటు చేసుకోవచ్చు. ఏరోబిక్స్​తో ఎన్నో లాభాలున్నాయన్నది ఎప్పుడో రుజువైంది. తాజాగా ఏరోబిక్స్ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌గా చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్‌‌‌‌గా పని చేస్తుందని కూడా స్టడీస్​లో వెల్లడైంది.

​యూత్ ఏరోబిక్స్..

చూడ్డానికి ఏరోబిక్స్​ డ్యాన్స్‌‌‌‌లా ఉండటం వల్ల.. ఈ ఎక్సర్‌‌‌‌సైజ్ చేయడానికి యూత్ తెగ ఇష్టపడుతోంది. ఈ వర్కవుట్ చేయడం రెండు విధాలుగా ఉంటుంది. డ్యాన్స్ చేయడాన్ని ఇష్టపడే వాళ్లు వీటిని ఎంచుకుంటే డ్యాన్స్ చేసినట్లు ఉంటుంది. అలాగే వర్కవుట్​ కూడా జరుగుతుంది. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.

గుండె ఆరోగ్యం మెరుగు..

ఏరోబిక్స్ చేయడం వల్ల కేవలం ఆనందమే కాదు.. క్యాలరీలు కూడా కరుగుతాయి. కండరాలు బలంగా మారతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఈ ఏరోబిక్స్ అనేవి చక్కని ప్రత్యామ్నాయాలు. వీటిని రెగ్యులర్‌‌‌‌గా చేయడం వల్ల ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గి, డిప్రెషన్ దరి చేరదంటున్నారు నిపుణులు.

బ్రెయిన్ షార్ప్..

వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది వాస్తవం. రెగ్యులర్‌‌‌‌గా ఏరోబిక్స్ చేయడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అంటున్నారు. జ్ఞాపకశక్తి సమస్యతో బాధపడేవారు.. ఏరోబిక్స్ చేయడం మంచిది. ముఖ్యంగా చదువుకునే స్టూడెంట్స్ ఈ తరహా వర్కవుట్స్ చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగి.. మెరుగ్గా చదువుతారట.

అందుకే ఎదిగే పిల్లలు ఏరోబిక్స్​ చేయడం మంచిదని సూచిస్తున్నారు. తాజాగా కొంతమందిపై పరిశోధనలు జరిపిన సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు.

​వారానికి 150 నిమిషాల పాటు..

వారాంలో కనీసం నూటా యాభై నిమిషాలైనా ఏరోబిక్స్ చేస్తేనే.. దాని ప్రభావం శరీరంపై ఉంటుందట. ఏరోబిక్స్ చేయడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది. మెదడుకి కూడా రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఈ కారణంగా బ్రెయిన్ సరిగా పనిచేస్తుందని చెప్తున్నారు నిపుణులు. రెగ్యులర్‌‌‌‌గా ఏరోబిక్స్ చేయడం వల్ల న్యూరోట్రోఫిన్స్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

జాగ్రత్తలు తప్పనిసరి..

ఏరోబిక్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏరోబిక్స్ మొదలు పెట్టిన కొత్తలో.. ఎక్కువ సమయం వర్కవుట్​ చేయకూడదు. మెల్లి మెల్లిగా టైమ్​పెంచుకుంటూ పోవాలి. అదే విధంగా.. ఈ ఎక్సర్‌‌‌‌సైజ్ చేయడానికి శక్తి ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ పోషకాహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు, ఎక్కువగా తీసుకోవాలి. అలాగే భోజనం చేసిన వెంటనే ఏరోబిక్స్ చేయకూడదు. కనీసం అరగంట సమయం అయినా రెస్ట్​ తీసుకోవాలి.