సిటీలో ఆఫ్రికన్ల సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ దందా

సిటీలో ఆఫ్రికన్ల సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ దందా

హైదరాబాద్,వెలుగు:  డ్రగ్స్ సప్లయర్‌‌‌‌ టోనీ ఢిల్లీలో ఉండి సిటీలో నెట్ వర్క్ పెంచుకుని డ్రగ్స్ దందా నడిపాడు. సౌత్‌‌ ఆఫ్రికాలోని డ్రగ్స్‌‌ స్మగ్లర్‌‌‌‌ స్టార్‌‌‌‌ బోయ్‌‌  సైతం సిటీకి వచ్చి  నైజీరియన్స్‌‌ నెట్‌‌వర్క్‌‌తో ఇక్కడ డ్రగ్స్ సేల్స్ చేయించాడు. వీసా గడవు ముగిసినా సిటీలో ఉంటూ ఇల్లీగల్ యాక్టివిటీస్​కు పాల్పడుతున్న ఆఫ్రికా దేశాలైన సూడాన్, కెన్యా, సోమాలియా, యెమన్స్​కు చెందిన వారితోనే టోనీ, స్టార్ బోయ్ నెట్ వర్క్​ను పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 2 నెలల వ్యవధిలో డ్రగ్స్ కేసుల్లో15 మంది నైజీరియన్లను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వీసా గడువు ముగిసినా తప్పించుకుతిరుగుతున్న వారిని ట్రేస్  చేసేందుకు ప్లాన్ చేశారు. ఇమ్మిగ్రేషన్, ఫారిన్‌‌ రీజనల్‌‌ రిజిస్ట్రేషన్‌‌ అధికారుల(ఎఫ్​ఆర్ఆర్ వో)తో కలిసి జాయింట్ ఆపరేషన్‌‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్రేటర్‌‌‌‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఫారినర్ల వివరాలను రాబడుతున్నారు.

గోవా, ముంబయి నుంచి డ్రగ్స్ సప్లయ్

పబ్స్‌‌తో పాటు సిటీలో ఎక్కడ డ్రగ్స్ కస్టమర్లు పట్టుబడ్డా నైజీరియన్ల కాంటాక్ట్స్‌‌ బయటపడుతున్నాయి. గోవా, ముంబయిలోని నైజీరియన్ల 
నెట్‌‌వర్క్‌‌తో కలిసి సిటీలో వీసా గడువు ముగిసినా ఉంటోన్న  నైజీరియన్లు డ్రగ్స్‌‌ సప్లయ్ చేస్తున్నారు. సిటీలో డ్రగ్స్ దందా కేసులో ప్రధాన 
నిందితుడైన సప్లయర్‌‌‌‌ టోనీని గతేడాది నార్త్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసగా డ్రగ్స్‌‌ కేసుల్లో నిందితుడుగా ఉండడంతో 
పీడీ యాక్ట్‌‌పై జైలుకు పంపించారు. టోనీకి ఆదేశాలు ఇచ్చే  స్టార్‌‌ ‌‌బోయ్ కోసం బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. లోకల్‌‌ నెట్‌‌వర్క్‌‌లో బెంగళూర్, గోవా, ఢిల్లీలోని డ్రగ్స్ ముఠాలకు నైజీరియన్లు కొరియర్స్‌‌గా మారినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విజిటింగ్ ,హెల్త్‌‌, టూరిస్ట్‌‌ వీసాలతో సిటీకి వచ్చే కొందరు తమ అవసరాల కోసం డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫారిన్ చదువుల పేరుతో వచ్చే ఆఫ్రికన్ స్టూడెంట్లు కూడా డ్రగ్స్ సప్లయ్ చేస్తూ గతంలో పోలీసులకు పట్టుబడ్డారు. వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లకుండా నేరాలకు పాల్పడుతున్నారని పోలీస్ కేస్ రికార్డ్స్ చెబుతున్నాయి. వీసాలో పేర్కొన్న అడ్రెస్​లో లేని వారి వివరాలను సేకరించి వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్‌‌ కస్టమర్లు, ఆన్‌‌లైన్ సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టైన నిందితుల కాంటాక్ట్స్‌‌ ఆధారంగా సిటీలో అక్రమంగా ఉంటోన్న  ఫారినర్ల వివరాలు సేకరిస్తున్నారు. 

హెల్త్‌‌, విజిటింగ్‌‌ వీసాలపై వస్తూ..

హాస్పిటల్‌‌, చదువులు, బిజినెస్‌‌ వీసాలపై ఆఫ్రికా దేశాల నుంచి వచ్చి సిటీలో ఉంటోన్న వారి పాస్ట్‌‌పోర్టులు, వీసాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్పెషల్‌‌ బ్రాంచ్‌‌ రిపోర్ట్​ సాయంతో వీసా గడువు ముగిసిన వారిని గుర్తించి  సొంత దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఉగాండకు చెందిన నలుగురు మహిళలు నార్సింగి పీఎస్  పరిధిలో ఇల్లీగల్ యాక్టివిటీస్​కు  పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. వీరి వీసా గడువు ముగిసినా సొంత దేశానికి  వెళ్ళకుండా ఇక్కడే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్, టోలిచౌకి,  గోల్కొండ, అసిఫ్‌‌నగర్, హుమాయున్ నగర్, సైబరాబాద్ కమిషరేట్‌‌ పరిధిలో  ఇలాంటి వారు  ఎక్కువగా ఉంటున్నట్లు ఆధారాలు సేకరించారు.