కర్నాటకలో స్కూళ్లు రీఓపెన్.. వందలాది టీచర్లకు కరోనా

కర్నాటకలో స్కూళ్లు రీఓపెన్.. వందలాది టీచర్లకు కరోనా

బెంగళూరు: కరోనా వైరస్ కారణంగా దాదాపు తొమ్మిది నెలలుగా దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసేసి ఉన్నాయి. తిరిగి స్కూళ్లు తెరవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్‌‌గా జనవరి 1న కర్నాటకలో స్కూళ్లను తెరిచారు. అయితే ఆ రాష్ట్రంలోని పాఠశాలల్లో పని చేస్తున్న 211 మంది టీచర్లకు కరోనా సోకడం సంచలనంగా మారింది. మరికొంత మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌‌ను కలుపుకుంటే పాజిటివ్‌‌ల సంఖ్య 236కి చేరింది. స్కూళ్లు తెరిచిన వారం రోజుల్లోనే ఇంతమంది ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా రావడం గమనార్హం. స్కూళ్లు తెరవడానికి ముందు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కరోనా టెస్టులు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయినా ఇంతమంది పాజిటివ్‌‌లుగా తేలడం పై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.