గోదావరి నీళ్లను మనకు దక్కకుండా చేసిండు కేసీఆర్:గడ్డం వంశీకృష్ణ

గోదావరి నీళ్లను మనకు దక్కకుండా చేసిండు కేసీఆర్:గడ్డం వంశీకృష్ణ

కాళేశ్వరంతో పెద్దపల్లికి ఉపయోగం ఏమీ లేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ధర్మపురిలో జనజాతర సభలో మాట్లాడిన ఆయన.. పెద్దపల్లికి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారని చెప్పారు.  కాకా హయాంలోనే పెద్దపల్లి సెగ్మెంట్అభివృద్ధి జరిగిందన్నారు.  కాకా ప్రపోజ్ చేసిన ప్రాణహిత చేవెళ్లను కేసీఆర్ పక్కన పెట్టి..  కమీషన్ల కోసం కేసీఆర్ కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. గోదావరి నీళ్లను మనకు దక్కకుండా చేశారు.. ఇక్కడి వాళ్లకు  నీళ్లు లేకుండా మళ్లించుకుపోయారని విమర్శించారు. కాళేశ్వరంతో పెద్దపల్లికి ఉపయోగం ఏమీ లేదన్నారు.

తాను సొంతంగా 500 మందికి ఉద్యోగాలిప్పించానని చెప్పారు గడ్డం వంశీకృష్ణ.  కేంద్రం నుంచి తనకు 6 పేటెంట్లు లభించాయన్నారు.  ఎంపీగా గెలిచి నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తానని చెప్పారు. పెద్దపల్లికి ప్రభుత్వ సంస్థలను తీసుకొచ్చే బాధ్యత తనదన్నారు. పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు.