హైదరాబాద్లో మొదలైన వీధి కుక్కల తొలగింపు.. ఒకే రోజు 277 స్ట్రీట్ డాగ్స్ యానిమల్ కేర్ సెంటర్కు

హైదరాబాద్లో మొదలైన వీధి కుక్కల తొలగింపు.. ఒకే రోజు 277 స్ట్రీట్ డాగ్స్ యానిమల్ కేర్  సెంటర్కు

హైదరాబాద్ లో వీధి కుక్కల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం (నవంబర్ 08) సిటీలోని పలు ఏరియాల్లో స్ట్రీట్ డాగ్స్ ను తరలించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో హాస్పిటల్స్ దగ్గర ఉన్న స్ట్రీట్ డాగ్స్ ను తొలగించారు.

పబ్లిక్ ప్లేసెస్ నుంచి వీధి కుక్కలను తొలగించాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా విద్యాసంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, రవాణా కేంద్రాల వద్ద కుక్కలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా చర్యలు ప్రారంభించింది జీహెచ్ఎంసీ.

ఫస్ట్ పేజ్ లో భాగంగా ఆసుపత్రుల వద్ద ఉన్న వీధి కుక్కలను పట్టుకుని యానిమల్ కేర్ సెంటర్స్ కు తరలిస్తున్నారు. శనివారం ఒక్కరోజే 277 వీధి కుక్కలను పట్టుకుని జీహెచ్ఎంసీ యానిమల్ కేర్ సెంటర్స్ కి తరలించారు వెటర్నరీసిబ్బంది. 

యానిమల్ కేర్ సెంటర్ లో కుక్కలకు సంరక్షణ, స్టెరిలైజేషన్‌, వ్యాక్సినేషన్‌ చేయనున్నారు.  త్వరలో ప్రైవేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ట్రాన్స్‌ పోర్ట్‌ హబ్‌ లలో కూడా ఈ చర్యలు కొనసాగించనున్న జీహెచ్ఎంసీ ప్రకటించింది.