ఓట్ చోరీతో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రధాని మోదీ , ఎన్నికల కమిషన్ పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.. హర్యానా, మహారాష్ట్ర లో ఓట్ చోరీ జరిగిందని ప్రూఫ్ లతో నిరూపించిన క్రమంలో ఎన్డీయే ఓట్ చోరీపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుందని కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ చెప్పారు. త్వరలో ఓట్ చోరీపై తెలంగాణలో ప్రజల దగ్గర వెళ్తామని చెప్పారు.
ఓట్ చోరీపై రాహుల్ గాంధీ అనే విషయాలు బయటపెట్టారన్నారు మీనాక్షి నటరాజన్. ఓట్ చోరీపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుందన్నారామె. ఓట్ చోరీపై ఢిల్లీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కర్ణాటకలో ఓటర్ జాబితాలో అవకతవకలు బయటపెట్టారు రాహుల్ గాంధీ. ఓట్ల చోరీతోనే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించారని చెప్పారు.
