బీహార్ లో ట్యాంపరింగ్ జరుగుతోందా..? ఓటర్లు వేసిన ఓట్లను తారుమారు చేస్తున్నారా..? స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న EVM లను అధికారుల సహకారంతో ట్యాంపరిగ్ చేస్తున్నారా..? ఇండియా కూటమికి చెందిన ఆర్జేడీ షేర్ చేసిన వీడియో ఈ ప్రశ్నలకు తావిస్తోంది. బీహార్ లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి భారీ ఉల్లంఘలకు పాల్పడుతున్నారంటూ ఆర్జేడీ షేర్ చేసిన వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నవంబర్ 06న ముగిసింది. రెండో దశ 11న, కౌంటింగ్ 14న జరగనుంది. ఈ క్రమంలో వైశాలి జిల్లాలో ఈవీఎంలను భద్రపరిచేందుకు రెండు స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.
అయితే ఆర్ఎన్ కాలేజీలో కౌంటింగ్ కోసం భద్రపరిచిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆర్జేడీ సంచలన వీడియో విడుదల చేసింది. ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మేనేజ్ చేస్తున్నారని.. దీంతో EVM ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు అనుమానంగా ఉందని ఆరోపించింది ఆర్జేడీ.
మహ్నార్-129 అసెంబ్లీ స్థానంలో ఉన్న ఈ ఆర్ఎన్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్లో సీసీటీవీ లను ఆఫ్ చేశారని అందుకు సంబంధించి వీడియో రిలీజ్ చేశారు ఆర్జేడీ నాయకులు.
వైశాలి జిల్లాలోని హజిపూర్ లో స్ట్రాంగ్ రూమ్ దగ్గర అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయని ఇన్స్టాగ్రామ్ లో వీడియో రిలీజ్ చేసింది RJD పార్టీ. రాత్రి వేళపికప్ వ్యాన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ వ్యాన్ వెళ్లేటప్పుడు CCTV కెమెరాలు స్విచ్ ఆఫ్ అయినట్లు చూపిస్తోంది. అక్కడున్న పెద్ద సీసీకెమెరా ఆఫ్ అయి ఉంది.. మిగతావి ఆన్ లో ఉన్నాయి. ఇది అనుమానాలకు తావిస్తోందని ఆర్జేడీ ఆరోపిస్తోంది.
ALSO READ : ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలా..
కౌంటింగ్ ఏరియాలోకి వెహికిల్స్ ..?
కౌంటింగ్ చేసేందుకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉన్న స్థలంలోకి వెహికిల్స్ ఎందుకు వెళ్తు్న్నాయని వీడియో రికార్డు చేసిన వ్యక్తి ప్రశ్నించాడు. ఇదే వీడియోను ఆర్జేడీ ఇన్న స్టాలో పోస్ట్ చేసింది. సీసీటీవీ ఆఫ్ చేసి ఉండటం చూస్తుంటే ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. అధికార జేడీయూ-బీజేపీ కూటమి అక్రమ మార్గంలో గెలిచేందుకు కుట్రలు చేస్తు్న్నట్లు ఆర్జేడీ నేతలు ఆరోపిస్తు్న్నారు.
बिहार में अभी पहले चरण का मतदान संपन्न हुआ है और चुनाव आयोग की नाक के नीचे स्ट्रॉंग रूम में गड़बड़ी शुरू हो गई है।
— AAP (@AamAadmiParty) November 8, 2025
यह Video वैशाली जिले के हाजीपुर में बने Strong Room का है, जहां रात को CCTV बंद कर दिया जाता है और स्ट्रॉंग रूम के अंदर से पिकअप निकलती है।
माननीय अज्ञानेश कुमार… pic.twitter.com/QBXH57BZUe
