మాదాపూర్, వెలుగు : మాదాపూర్లోని శిల్పారామంలో ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 8వ తేది వరకు నిర్వహించే ఈ మేళాలో ఒడిశా సాంప్రదాయాలు, కళలు, హస్తకళా ఉత్పత్తులు, సాంప్రదాయ వంటకాలు, జానపద నృత్యాలు, శాస్త్రీయ ప్రదర్శనలతో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. శిల్పారామం స్పెషల్ అఫీసర్ జి. కిషన్ రావు, ఎన్ఎండీసీ మాజీ డైరెక్టర్ డి.కె. మహంతి ముఖ్య అతిథులుగా హాజరై మేళాను ప్రారంభించారు.
