ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం: మల్లు రవి

ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీల ఫోరం తెలంగాణ కన్వీనర్ మల్లు రవి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లపై మాత్రమే మాట్లాడుతున్నారని క్లారిటీ ఇచ్చారు. 

ఈ అంశాన్ని బూతద్దంలో చూపి... బీజేపీ మాత్రం మతపరమైన రిజర్వేషన్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు.