నిజామా బాద్ లెగసీని కంటిన్యూ చేస్తం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

నిజామా బాద్ లెగసీని కంటిన్యూ చేస్తం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీకి పెద్ద నాయకులను అందించిన జిల్లాగా నిజామాబాద్​కు ఉన్న లెగసీని కంటిన్యూ చేస్తాం. అర్గుల్ రాజారామ్, రాంగోపాల్​ రెడ్డి, డి.శ్రీనివాస్, సంతోష్​ రెడ్డి వంటివారు పార్టీకి అసమాన సేవలు అందించారన్నారు. నగరంలోని పురాతన గంజ్ మార్కెట్​కు స్టేట్​లోనే  గొప్ప పేరుంది.1931లో ఏర్పడిన నిజామాబాద్​ మున్సిపాలిటీని ఎంపీ అర్వింద్​ స్మార్ట్​ సిటీ చేయించకపోవడంతో నష్టం జరుగుతున్నది. 

సెకెండ్​ ఫేజ్​లో నిర్ణయించే ఎయిర్​పోర్టుల్లో నిజామాబాద్​కు చోటు కల్పిస్తే హైదరాబాద్, ముంబై, నాగ్​పూర్​కు కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి చెందుతుంది. నేషనల్​ క్రీడాకారులను అందించిన జిల్లాను స్పోర్ట్​ హబ్​ చేయాలి. టూరిజానికి బాగా స్కోప్​ ఉన్న నిజామాబాద్​కు అధిక ఫండ్స్​ ఇచ్చి డెవలప్​ చేయాలి. 

ఎన్ని రేషన్​ కార్డులైనా ఇస్తం : మంత్రి ఉత్తమ్

దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో పేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత సీఎం రేవంత్​రెడ్డి సర్కారుది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్​ హయాంలో నిజామాబాద్​ జిల్లాలో 2.50 లక్షల కార్డులు మాత్రమే ఉండేవి. కొత్తగా ఒక్క రేషన్​ కార్డు ఇవ్వలేదు. అర్హులైన పేదలకు కొత్త కార్డులిచ్చి కాంగ్రెస్​ సర్కార్ వాటిని 3.15 లక్షలకు పెంచింది. ఇంకా ఎంత మంది పేదవారికి ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాం. బీఆర్​ఎస్​ హయాంలో జిల్లాలో ఖరీఫ్​ సీజన్​లో 4.25 మెట్రిక్​ టన్నుల వడ్లు మాత్రమేకొని.. రూ.923 కోట్లు చెల్లించారు. మా పాలనలో 7 లక్షల మెట్రిక్​ టన్నులుకొని బోనస్ కలిపి రూ.2 వేల కోట్ల పేమెంట్​ చేశాం.

ఉమ్మడి జిల్లాకో  పామాయిల్​ ఫ్యాక్టరీ : - మంత్రి తుమ్మల

వరిసాగులో రికార్డు సృష్టించిన మన రాష్ట్రం.. ఆయిల్​పామ్​ సాగులో కూడా ఫస్ట్​ ప్లేస్​ సాధించబోతున్నది. ఇప్పుడున్న 3 లక్షల ఎకరాల ఆయిల్​పామ్​ సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరిస్తాం. ప్రతి ఉమ్మడిజిల్లాకో పామాయిల్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. రైతును రాజును చేయడమే తమ లక్ష్యం. వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్న నిజామాబాద్​కు వ్యవసాయ కాలేజీ ఇచ్చాం.