రక్షణ సంస్థల చుట్టూ రోహింగ్యాలా..?..వెంటనే ఖాళీ చేయించాలని గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్

రక్షణ సంస్థల చుట్టూ రోహింగ్యాలా..?..వెంటనే ఖాళీ చేయించాలని గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్

 ఓల్డ్​సిటీ, వెలుగు: సిటీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ రోహింగ్యాలను వెంటనే వెనక్కి పంపించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్​చేసింది. బాలాపూర్, కంచన్​బాగ్​ ప్రాంతాల్లోని డీఆర్డీఓ, మిధాని వంటి రక్షణ సంస్థల చుట్టూ ఉన్న  26 కాలనీల్లో దాదాపు 6,993 మంది రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నారన్నారు.

వీరిని వెంటనే ఖాళీ చేయించాలని శుక్రవారం పురానీ హవేలీలోని కమిషనర్ ఆఫీస్​లో సీపీ సజ్జనార్​ను కలిసి ఉత్సవ సమితి ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. రక్షణ సంస్థల సమీపంలో అక్రమ రోహింగ్యాల ఉనికి భద్రతా పరంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.