ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలా.. ఇలా ఆన్‌లైన్‌లో ఫ్రీగా, ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చు..

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలా.. ఇలా  ఆన్‌లైన్‌లో  ఫ్రీగా, ఈజీగా  అప్‌డేట్ చేసుకోవచ్చు..

మీరు కొత్త ఇంటికి లేదా వేరే ప్రదేశానికి మారారా... అయితే మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చడం చాలా ముఖ్యం.  ఆధార్ జారీచేసే సంస్థ (UIDAI) అడ్రస్ మార్పు కోసం myAadhaar పోర్టల్‌లో 14 జూలై  2026 వరకు ఫ్రీగా అందిస్తోంది. ఇందుకు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి వద్దనే చెయ్యొచ్చు. 

ఆన్‌లైన్లో ఆధార్ అడ్రస్ మార్పుకు సింపుల్ ప్రాసెస్ ఇలా : 
* ఇంటర్నెట్ కనెక్షన్  ఉన్న స్మార్ట్ ఫోన్ లేదా లాప్ టాప్  నుంచి అఫీషియల్ myAadhaar పోర్టల్ (myaadhaar.uidai.gov.in) ఓపెన్ చేయండి.
*ఇప్పుడు మీ 12-అంకెల ఆధార్ నంబర్ అలాగే స్క్రీన్‌పై కనిపించే Captcha Code ఎంటర్ చేయండి.
*ఇప్పుడు "Send OTP" (ఓటీపీ పంపండి) పై క్లిక్ చేయండి.
*మీ ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) ని ఎంటర్ చేసి "Login" (లాగిన్) అవ్వండి. తరువాత అప్‌డేట్ ఆప్షన్ క్లిక్ చేయండి. 
*లాగిన్ అయిన తర్వాత, "Update Aadhaar Online" (ఆధార్ ఆన్‌లైన్ అప్‌డేట్) అనే ఆప్షన్‌ క్లిక్ చేయండి. 
*మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఫీల్డ్‌గా "Address" (చిరునామా) ను క్లిక్ చేసి  "Proceed to Update Aadhaar" (ఆధార్ అప్‌డేట్‌కు కొనసాగండి) పై క్లిక్ చేయండి.

*ఇప్పుడు కొత్త అడ్రస్ ఎంటర్ చేయండి. మీ కొత్త అడ్రస్ (Address) వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేసి 'కేర్ ఆఫ్' (C/O, S/O, W/O, D/O) వివరాలను సరిగ్గా ఇవ్వండి. మీరు అప్‌లోడ్ చేసే అడ్రస్ ప్రూఫ్ లో (Proof of Address - POA) ఉన్న అడ్రస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి.
*ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి. మీ కొత్త అడ్రస్ వెరిఫై చేయడానికి వాలిడిటీ ఉన్న ప్రూఫ్ ఉదా: పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, విద్యుత్/గ్యాస్ బిల్లు మొదలైనవి స్కాన్ చేసి లేదా ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి.
*ఆమోదించిన ప్రూఫ్ లిస్ట్ కోసం UIDAI వెబ్‌సైట్‌  చూడవచ్చు.
*ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన కొత్త అడ్రస్, అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
*ప్రస్తుతం అంటే 14 జూలై  2026 వరకు చార్జెస్  లేవు కాబట్టి ఫ్రీ. 
*చివరికి "Submit"  పై క్లిక్ చేయండి.

అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయడం ఎలా అంటే :
*సబ్మిట్ చేసిన తర్వాత, మీకు 14-అంకెల URN (Update Request Number) వస్తుంది.
*ఈ URN ను ఉపయోగించి myAadhaar పోర్టల్‌లో ఎప్పుడైనా మీ అప్‌డేట్ స్టేటస్‌ చెక్  చేయవచ్చు.
*సాధారణంగా ఈ ప్రక్రియకు కొన్ని రోజులు పడుతుంది, అత్యధికంగా 30 రోజులు కూడా  పట్టవచ్చు.
 గుర్తుంచుకోండి మీ మొబైల్ నంబర్ ఆధార్ తో  లింక్ కాకపోతే, ఆన్‌లైన్‌లో అడ్రస్ మార్చలేరు. మీరు తప్పకుండా ఆధార్ సర్వీస్  సెంటర్ (Aadhaar Seva Kendra) కు వెళ్లాలి