రోజూ గుడ్లు తింటున్నారా ? లేదంటే ఈ 4 లాభాలను మిస్ అవుతున్నట్లే!

రోజూ గుడ్లు తింటున్నారా ? లేదంటే ఈ 4 లాభాలను మిస్ అవుతున్నట్లే!

గుడ్లు చూడటానికి చాలా సాధారణంగా అనిపించినా, వాటిలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఒక ఉడికించిన గుడ్డు ద్వారా మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్, మంచి కొవ్వులు, విటమిన్ B12, D ఇంకా జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా అందుతాయి. ప్రముఖ డాక్టర్ ప్రకారం, వరుసగా రెండు వారాల పాటు రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తింటే మన శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయట. ఆ 4 మార్పులు ఏంటో తెలుసా... 

1.  మెరిసే చర్మం
గుడ్లలో ఉండే ప్రోటీన్ నాణ్యత చాలా ఎక్కువ. మన శరీరానికి కావాల్సిన 'అమైనో ఆమ్లాలు' ఇందులో సరైన మోతాదులో ఉంటాయి. ఇది కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, దెబ్బతిన్న కణజాలాలను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది.

2.  మెదడు చురుగ్గా
గుడ్లలో 'కోలిన్' (Choline) అనే ముఖ్యమైన పోషకం ఉంటుంది. ఇది చాలా తక్కువ ఆహార పదార్థాల్లో దొరుకుతుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతకి  చాలా అవసరం.

3.  'మంచి' కొలెస్ట్రాల్
చాలామంది గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడతారు. కానీ, గుడ్ల వల్ల శరీరానికి మేలు చేసే HDL (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా శరీరంలో కొలెస్ట్రాల్ బ్యాలెన్స్  చేస్తుంది.

4.  షుగర్ కంట్రోల్ 
ఉదయం పూట పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఎక్కువగా ఉండే టిఫిన్లకు బదులు గుడ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీనివల్ల నీరసం రాదు, ఆకలి త్వరగా వేయదు. మధ్యాహ్నం వరకు మంచి శక్తితో, ఏకాగ్రతతో పని చేసుకోగలుగుతారు.  మీ శరీరాన్ని బట్టి, ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలనేది మీ వైద్యుడిని సంప్రదించి నిర్ణయించుకోవడం మంచిది.