న్యూఢిల్లీ: గడిచిన పదేండ్లలో దేశంలో రైల్వేల ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగు పడిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన రాజ్యసభ ప్రశ్నోత్తరాల టైంలో బీజేపీ ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్‌పేయి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చారు. "ప్రధాని మోదీ నాయకత్వంలో గత పదేండ్లలో రైల్వేల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. 2014~24 కాలంలో 5.04 లక్షల ఉద్యోగాలిచ్చాం. వచ్చే మూడేండ్లలో మరో 1.5 లక్షల ఉద్యోగాలిస్తాం.
ఉద్యోగులకు రూ. 1.18 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నం. పెన్షనర్లకు రూ.65 వేల కోట్లు చెల్లిస్తున్నం. ఇలా ఏడాదికి మొత్తం రూ.2.74 లక్షల కోట్లు ఖర్చు అవుతున్నది. 2024~25 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఖర్చులుపోను రూ. 2,660 కోట్ల వరకు ఆదాయం వచ్చింది" అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
