Sri Mrityunjay: శ్రీవిష్ణు నుంచి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ అనౌన్స్

Sri Mrityunjay: శ్రీవిష్ణు నుంచి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ అనౌన్స్

బ్యాక్ టు బ్యాక్  సినిమాలు చేస్తూ  హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శ్రీవిష్ణు.  తను నటిస్తున్న చిత్రాల్లో ఒకటి  ‘మృత్యుంజ‌‌య్‌‌’.  ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌‌‌‌గా దర్శకుడు  హుస్సేన్ షా కిర‌‌ణ్ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ర‌‌మ్య గున్నం స‌‌మ‌‌ర్పణ‌‌లో లైట్‌‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌‌ఫెక్ట్ ఎంటర్‌‌టైన్‌‌మెంట్ బ్యానర్స్‌‌పై  సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి  నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ అప్‌‌డేట్  అనౌన్స్‌‌మెంట్‌‌ పోస్టర్‌‌‌‌లో శ్రీవిష్ణు..  పేప‌‌ర్లతో నిండిన రోడ్డుపై నిల‌‌బ‌‌డి ఉండటం ఆసక్తిని పెంచుతోంది.  బ్లాక్ బ‌‌స్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా జాన్ జంటగా నటిస్తున్నారు.  శ్రీక‌‌ర్ ప్రసాద్ ఎడిట‌‌ర్‌‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి  విద్యాసాగ‌‌ర్ సినిమాటోగ్రఫీ,  కాల భైర‌‌వ సంగీతాన్ని  అందిస్తున్నారు.