టీవీకే చీఫ్ విజయ్కి కోర్టులో చుక్కెదురు... ఆదాయపు పన్ను శాఖ రూ.1.50 కోట్ల ఫైన్ పై పిటిషన్ రిజెక్ట్

టీవీకే చీఫ్ విజయ్కి కోర్టులో చుక్కెదురు... ఆదాయపు పన్ను శాఖ రూ.1.50 కోట్ల ఫైన్ పై పిటిషన్ రిజెక్ట్

చెన్నై: తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. 2015 –-16 ఆర్థిక సంవత్సరంలో తన పూర్తి ఆదాయాన్ని వెల్లడించలేదన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ. 1.50 కోట్ల జరిమానాను సవాలు చేస్తూ  విజయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌‌ను మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 2016 -‌‌–17 ఆర్థిక సంవత్సరానికి విజయ్​తన రూ.35.42 కోట్ల ఆదాయాన్ని ప్రకటించారు.

అయితే, 2015లో అతని నివాసంలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా.. ‘పులి’ అనే తమిళ చిత్రం నుంచి సంపాదించిన రూ.15 కోట్ల ఆదాయాన్ని అతను వెల్లడించలేదని ఆ శాఖ ఆరోపించింది. అనంతరం 2022 జూన్ 30 న రూ. 1.50 కోట్ల జరిమానా విధించింది. దానిని సవాలు చేస్తూ విజయ్ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సెంథిల్‌‌ కుమార్ రామమూర్తి తీర్పు వెలువరించారు.