Euphoria: పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ‘యుఫోరియా’.. గుణశేఖర్ టీమ్ హ్యాపీ

Euphoria: పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ‘యుఫోరియా’.. గుణశేఖర్ టీమ్ హ్యాపీ

దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన యూత్‌‌ఫుల్ సోషల్ డ్రామా ‘యుఫోరియా’. భూమిక కీలకపాత్ర పోషించిన  ఈ చిత్రంతో విఘ్నేశ్ గ‌‌విరెడ్డి హీరోగా పరిచయం అయ్యాడు. నీలిమ గుణ నిర్మించారు.

శుక్రవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో గుణ శేఖర్ మాట్లాడుతూ ‘ఈ  సినిమాకు మార్నింగ్ షో నుంచే మంచి  ప్రశంస‌‌లు వ‌‌స్తున్నాయి.  

ఈ టైటిల్ చూసి యూత్ వ‌‌స్తార‌‌ని అనుకున్నా. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వ‌‌స్తున్నారు. విడుదలైన అన్ని సెంటర్స్‌‌ నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది.  ఇంత బోల్డ్ కంటెంట్‌‌ను ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని  వ‌‌ర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.  

తల్లీ కొడుకు మధ్య ఉన్న సంఘ‌‌ర్షణ‌‌కు మంచి అప్లాజ్ దక్కుతోంది’ అని చెప్పారు. నటులు విఘ్నేశ్, పృథ్వీ,  నిర్మాత నీలిమ గుణ కార్యక్రమంలో  పాల్గొని ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.