జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు నవీన్ యాదవ్ ను గెలిపించాలని జూబ్లీ హిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమవుతుంది.. ఓటర్లు ఆలోచించి ఓటేయాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ పక్కా గెలుస్తడని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది..పథకాలతో పాటు అభివృద్దికి పెద్ద పీట వేస్తుంది.. అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించి అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లు కోరారు.
