జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాల్సిందిగా నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. శనివారం (నవంబర్ 08) నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన వంశీ.. ప్రతి సమస్యను నోట్ చేసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇది ఉప ఎన్నికల సమయం.. మంత్రి వివేక్ వెంకటస్వామి గల్లీ గల్లీ లో తిరుగుతున్నారు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రూ.200 కోట్లతో పనులు అవుతున్నాయి.. ప్రజా పాలనలో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.
ఎంత ఇబ్బంది ఉన్నా ఇక్కడ పనులు చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఫండ్స్ తెచ్చి ఇక్కడ మంత్రి వివేక్ పపనులు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల రోజు నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని పిలుపనిచ్చారు.
