రెండో భార్యను హత్య చేసేందుకు తుపాకీ కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి... అంబర్ పేట్ లో వాహన తనిఖీల్లో..

రెండో భార్యను హత్య చేసేందుకు తుపాకీ కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి... అంబర్ పేట్ లో వాహన తనిఖీల్లో..

హైదరాబాద్ లో రెండో భార్యను హత్య చేసేందుకు తుపాకీ కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. మంగళవారం ( మార్చి 10 ) అంబర్ పేట్ లో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒక తుపాకీ, 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..  మల్కాజ్గిరి కి చెందిన అరుణ్ కుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన రెండవ భార్యను హత్య చేయడానికి బీహార్ నుండి తుపాకీ  కొనుగోలు చేసినట్లు తెలిపారు పోలీసులు.

తుపాకీ కొనుగోలుకు మల్కాజ్ గిరి కి చెందిన మహమ్మద్ అబ్బు, యాకూబ్ పురాకు చెందిన మీర్ ముజం మిల్ అనే ఇద్దరు వ్యక్తులు సహకరించారని తెలిపారు పోలీసులు. అరుణ్ కుమార్ తుపాకీని బీహార్ నుండి ఈ ఇద్దరు వ్యక్తుల సహాయంతో కొనుగోలు చేశాడని..విచారణలో వెల్లడించినట్లు తెలిపారు పోలీసులు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు పోలీసులు. నిందితుల దగ్గరి నుంచి ఒక తుపాకీ, ఆరు బుల్లెట్లు, ఒక బైక్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ కేసుపై  అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.