Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. ఇంటి బెంగతో రాము సెల్ఫ్ ఎలిమినేట్!

 Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. ఇంటి బెంగతో రాము సెల్ఫ్ ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు ఫినాలే వైపు అడుగులేస్తుండగా, ప్రతి వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠను పెంచుతోంది. ఈ తొమ్మిదో వారం కూడా హోస్ట్ అక్కినేని నాగార్జున తనదైన శైలిలో 'శివ' సినిమా రీ-రిలీజ్ హంగామాతో హౌస్‌లో సందడి సృష్టించారు. డైరెక్టర్ ఆర్జీవీ, హీరోయిన్ అమలలతో కలిసి నాగ్ స్టేజ్ పంచుకున్నారు. నాగ్-అమల జోడీ డ్యాన్స్ చేసి అందరిని అలరించారు. వీకెండ్ అంటే ఎలిమినేషన్ గండం తప్పదు. అయితే, ఈసారి బిగ్ బాస్‌కు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. నామినేషన్స్ ద్వారా కాకుండా, ఒక బలమైన కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని హౌస్‌ను వీడనున్నట్లు లీకులు రావడంతో బిగ్ బాస్ లవర్స్ షాక్‌కి గురయ్యారు.

రాము ఎమోషనల్ అడుగు

తొమ్మిదో వారం నామినేషన్స్‌లో సంజన, సుమన్ శెట్టి, భరణి, కల్యాణ్, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, తనూజ ఉన్నారు. ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం, సాయి శ్రీనివాస్ లీస్ట్ ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో ఉండగా, రాము రాథోడ్ సైతం చివరి స్థానాల్లో ఉన్నాడు. దీంతో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడని అంతా భావించారు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్ట్ నెలకొంది.. తెలంగాణ ఫోక్ సింగర్, డాన్సర్‌గా మంచి ఫాలోయింగ్ ఉన్న రాము రాథోడ్ గత కొన్నాళ్లుగా ఇంటిపై బెంగతో డల్‌గా ఉంటున్నాడు. ఐదో వారం వరకు యాక్టివ్‌గా ఉన్న రాము, ఆ తర్వాత గేమ్‌పై దృష్టి పెట్టలేకపోయాడు. టాస్క్‌లలో పోరాడకుండానే గివ్ అప్ ఇవ్వడం, నామినేషన్స్‌లో కూడా సరిగా వాదించకపోవడం వంటివి అతనిలో మార్పును స్పష్టం చేశాయి. హౌస్‌మేట్స్, నాగార్జున ప్రోత్సహించినా..  రాము తన నిర్ణయం మార్చుకోలేకపోయాడు.

 "వెళ్తాను సార్"

శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున రాము డల్‌గా ఉండడానికి గల కారణం అడిగారు. దీనికి సమాధానంగా రాము తన ఎమోషనల్ జర్నీని పంచుకున్నాడు. చిన్నప్పుడే మా అమ్మానాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా ఐదారేళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో మళ్లీ ఇన్నిరోజులు దూరంగా ఉండలేకపోతున్నాను అంటూ రాము కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన బాధను వ్యక్తం చేస్తూ, తనదైన స్టైల్లో "బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా" అంటూ ఎమోషనల్ పాట పాడి ఇంటిపై బెంగను బయటపెట్టాడు.

దీంతో నాగార్జున బిగ్‌బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని ఆదేశించగా, తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్‌ అడగ్గా, రాము దీనంగా "వెళ్తాను సార్" అని చెప్పడంతో అతడి ప్రయాణం ముగిసినట్లు తెలుస్తోంది. ప్రోమోలో డ్రామా చూపించినప్పటికీ, నిజంగానే రాము సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా హౌస్‌ను వీడినట్లు సమాచారం.

 డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

రాము సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం వల్ల, రెగ్యులర్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. ఓటింగ్ ప్రకారం చివరి స్థానంలో ఉన్న సాయి శ్రీనివాస్‌ను కూడా పంపిస్తారా, లేక రాము సెల్ఫ్ ఎలిమినేషన్ కారణంగా ఈ వారం రెగ్యులర్ ఎలిమినేషన్ ఉండదా అనేది ఆదివారం ఎపిసోడ్‌లో తేలనుంది. చాలావరకు అయితే, రాము మాత్రమే బయటకు రావొచ్చని, తద్వారా ఈ వారం సింగిల్ ఎలిమినేషన్‌తో సరిపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. రాము హౌస్‌లో మంచి ఎంటర్టైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతడి అకస్మాత్తు నిర్ణయం హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యం కలిగించింది.