హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వినియోగం కలకలం రేపింది. 2025 నవంబర్ 08వ తేదీన డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడిన వారిలో అందరూ స్టూడెంట్సే కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈగల్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన రైడ్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
బేగంపేటలోని క్యులినరీ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో డ్రగ్స్ వినియోగం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేవారు. ఆరుగురు విద్యార్థులు గంజా సేవించినట్లు గుర్తించారు. 6 మంది విద్యార్థులకు డ్రగ్ టెస్టు పరీక్ష పాజిటివ్ గా వచ్చినట్లు చెప్పారు పోలీసులు.
పట్టుబడిన వారు చివరి సంవత్సరం హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు కావడం గమనార్హం. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు పోలీసులు.
విద్యార్థుల స్నేహితుడే డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు.
