హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న కారులో మంటలు.. కృష్ణగిరి ఈగల పెంట దగ్గర భారీ ట్రాఫిక్ జాం

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న కారులో మంటలు.. కృష్ణగిరి ఈగల పెంట దగ్గర భారీ ట్రాఫిక్ జాం

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న కారులో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం (నవంబర్ 08) కృష్ణగిరి ఈగలపెంట దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. కారులో మంటలు చెలరేగటంతో హైవేపై ట్రాఫిక్ జాం అయ్యింది.

నాగర్ కర్నూల్ జిల్లా క్రిష్ణగిరి ఈగలపెంట వద్ద ప్రమాదవశాత్తు ఫార్చునర్ కారులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించి కారులో నుంచి బయటకు దిగటంతో ప్రయాణికులు పెద్దప్రమాదాన్ని తప్పించుకున్నారు. ప్రయాణికులను హైదరాబాద్ చిక్కడపల్లి వాస్తవ్యులుగా గుర్తించారు. 

ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ తర్వాత మంటలు ఆర్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.