ఇరాన్ పాలకులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వైట్ హౌస్ లో మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ తో 47 ఏండ్లుగా చర్చలు చేస్తునే ఉన్నాం కానీ ఫలితం మాత్రం సున్నా అని అన్నారు. ఈలోగా వేలాది మంది సైనికుల ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ప్రభుత్వం మారితే అంత కన్నా మంచి విషయం మరోకటి ఉండదు అని చెప్పారు. అణు ఒప్పందంపై చర్చలు ఓ కొలిక్కి రాని పక్షంలో సైనిక చర్యకు వెనుకాడబోమని అన్నారు.
ఈ నేపథ్యంలో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే రెండో విమాన వాహక నౌకతో ఇరాన్ పై దాడికి ఆదేశించామన్నారు. ప్రస్తుతం ఇరాన్ సరిహద్దులకు భారీ స్థాయిలో అమెరికా సైన్యం చేరుకుందని, త్వరలోనే మరో యుద్ధ నౌక మోహరిస్తుందని తెలిపారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే తమ లక్ష్యం అని ట్రంప్ స్పష్టం చేశారు.
