రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఈరోజు (14 febrauary)న రెండు కుక్కలను దత్తత తీసుకున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా తాను రెండు కుక్కలను దత్తత తీసుకుంటున్నట్టు చెప్పారు. నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సమాజానికి డాగ్స్ ఎంతో అవసరమని.. చరిత్రలో కుక్కలను కాలభైరవుడుగా పూజలు చేస్తామని అన్నారు. 'కుక్కలు మనుషుల భద్రతకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని ప్రేమించాలి తప్ప ద్వేషించకుండా ప్రజలు ఉండాలి. జీహెచ్ఎంసీ డాగ్స్ ని కాపాడడం అభినందనీయం. సుప్రీం కోర్ట్ కుక్కలను కాపాడాలని చెప్తుంది. సమాజంలో చదువుకున్న వారందరు వాటి సంరక్షణ కోసం సహకరించాలి' అని సూచించారు. కుక్క ఒక మనిషితో సమానమని.. వాటికి విశ్వాసం చాలా ఎక్కువ అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
కాంగ్రెస్ పార్టీది అహింస సిద్ధాంతం: సీతక్క దేశంలో కాంగ్రెస్ పార్టీ అహింస సిద్ధాంతంతో ముందుకు సాగుతుందని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. డాగ్స్ పై జరిగిన దాడులకు ప్రభుత్వం ఎక్కడ ప్రోత్సహించలేదన్నారు. సమాజంలో ప్రకృతిలో విష పురుగులు కూడా జీవిస్తున్నాయని.. కుక్కలు మనుషులకు మంచి భద్రత కల్పిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో, గ్రామపంచాయతీల్లో కుక్కలు మనుషులపై తిరగబడకుండా అవగహన కల్పించే కార్యక్రమం తీసుకవస్తామన్నారు.
