అన్నింటికీ పెట్టి పుట్టాలి.. అదృష్టం ఉండాలి అంటారు.. అంత నిరుత్సాహం.. అంత వైరాగ్యం ఎందుకు అంటారా.. కొన్ని కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి.. అది దుబాయ్.. ఓ షేక్ ఇంట్లో పెళ్లి.. అందరూ వెళ్లారు.. తిన్నారు.. ఫొటోలు దిగారు.. బహుమతులు ఇచ్చారు.. ఇంత వరకు బాగానే ఉంది.. పెళ్లికి వచ్చిన అతిధులకు రిటర్న్ గిఫ్టులు ఉంటాయి కదా.. మన దగ్గర అయితే ప్లాస్టిక్ డబ్బాలు.. చీరలు.. స్టీల్ గిన్నెలు.. ఇలా ఇస్తారు.. ఆయన దుబాయ్ షేక్ కదా.. ఒక్కొక్కరికీ ఒక్కో బంగారం బిస్కెట్ ఇచ్చాడు.. అది కూడా 24 క్యారట్ల బంగారం బిస్కెట్.. ఒక్కో బిస్కెట్ 10 గ్రాములుపైనే ఉంది అంట.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్నది అసలు బంగారమా లేక బంగారం లాంటి చాక్లెట్లా.. ఇప్పుడు ఇదే అతి పెద్ద డిస్కషన్.. పూర్తి వివరాల్లో వెళ్లిపోదామా...
ఓ అరబ్ పెళ్లి వీడియోలో ఒక వ్యక్తి చేతిలో ఓ పెట్టె పట్టుకుని పెళ్లికి వచ్చిన అతిథుల ముందు వస్తాడు. ఈ పెట్టెలో బంగారు బిస్కెట్లు ఉండటం కనిపిస్తాయి. ప్రతి అతిథి ఒక బిస్కెట్ లేదా నచ్చినన్ని బంగారు బిస్కెట్లు తీసుకుంటుంటారు. సౌదీ పెళ్లిలలో డబ్బును పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. అలాగే, ఈ వీడియో అరబ్ లు కోరిశ్వర్లు, పెళ్లిలో వరుడి బంధువులకి బంగారు బిస్కెట్లు ఇస్తున్నారు అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ 33 సెకన్ల వీడియో క్లిప్‌లో, 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను గెస్టులకు ఇస్తున్నట్లు చూడొచ్చు, అయితే ఈ వీడియో వెనుక ఉన్న నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ALSO READ : మీరు మంచి ఆటగాళ్లే.. ఏ ఆట ఆడటానికి వెళ్లారు..
ఈ వీడియోను సోషల్ మీడియా 'X'లో షేర్ చేశారు. ఇందులో ఒక వ్యక్తి మెరిసే బంగారు కడ్డీలతో నిండి ఉన్న పెట్టెను తీసుకెళ్లి పెళ్లిలో కూర్చున్న అతిథులకు అందిస్తుండటం కనిపిస్తుంది. సౌదీ అరేబియాలో జరిగిన పెళ్లిలో వధువు సోదరుడు వరుడి కుటుంబానికి 24 క్యారెట్ల బంగారు కడ్డీలను గిఫ్ట్ గా ఇచ్చాడు" అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే 3.7 లక్షలకు పైగా వ్యూస్ పొందింది. అలాగే వందల కామెంట్స్ వచ్చాయి.
ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు దీనిని రాయల్ హాస్పిటాలిటీ అనగా, మరికొందరు దీనిని కేవలం సంపద చూపించుకునేందుకు అని విమర్శించారు. అయితే, వీడియోను గమనించిన నెటిజన్లు అసలు విషయాన్ని కనిపేట్టరు.
బంగారు బిస్కెట్లా లేక లగ్జరీ చాక్లెట్లా?
ప్రజలు బంగారు బిస్కెట్లు అని అనుకుంటున్నవి నిజంగా బంగారు బిస్కెట్లు కాదు, అవి లగ్జరీ చాక్లెట్లు. ఇవి మిడిల్ ఈస్ట్ లోని ఫెమస్ ప్రీమియం చాక్లెట్ బ్రాండ్ 'patchi' చాక్లెట్లు. ఈ చాక్లెట్లు బంగారు బిస్కెట్లలగా కనిపించే బంగారు చుట్టలో చుట్టి ఉంటాయి. మీరు దగ్గరగా చూస్తే, ఇవి నిజంగానే బంగారు బిస్కెట్లు అనే అనుకుంటారు. అయితే అరబ్ దేశాల పెళ్లిళ్లలో ఇలాంటి ఖరీదైన, బంగారు రంగు చాక్లెట్లను ఇవ్వడం ఒక పెద్ద సంప్రదాయం ఉంది.
