మీరు మంచి ఆటగాళ్లే.. ఏ ఆట ఆడటానికి వెళ్లారు.. : వింటర్ ఒలింపిక్స్ లో కండోమ్ ల కొరత..!

మీరు మంచి ఆటగాళ్లే.. ఏ ఆట ఆడటానికి వెళ్లారు.. : వింటర్ ఒలింపిక్స్ లో కండోమ్ ల కొరత..!

ప్రస్తుతం జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ఒక వింత చర్చ జరుగుతోంది. ఒలింపిక్ విలేజ్‌లో అథ్లెట్ల కోసం ఉంచిన ఉచిత కండోమ్‌లు కేవలం మూడు రోజుల్లోనే అయిపోయాయి. దీనికి సంబంధించిన ఆసక్తికర చూస్తే..  సమాచారం ప్రకారం, ఒలింపిక్స్‌  క్రీడలు ప్రారంభమైన వెంటనే అథ్లెట్లకు ఇచ్చే 10వేల కండోమ్‌లు వేగంగా అయిపోయాయి. కండోమ్‌లు ఇంత త్వరగా అయిపోతాయని నిర్వాహకులు కూడా ఊహించలేదు. అయితే త్వరలోనే మరిన్ని వస్తాయని హామీ ఇచ్చినా, అవి ఎప్పుడు వస్తాయనేది ఇంకా స్పష్టత లేదు.

మిగతా ఒలింపిక్స్‌తో పోలిస్తే..
ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఈసారి సప్లయ్ విషయంలో కాస్త వెనకబడ్డారని విమర్శలు వస్తున్నాయి. గతంతో పోల్చి చూస్తే 2024 పారిస్ ఒలింపిక్స్ లో  దాదాపు 3 లక్షల కండోమ్‌లు ఇచ్చారు.. అంటే ప్రతి అథ్లెట్‌కు రోజుకు రెండు.

కానీ ప్రస్తుత వింటర్ ఒలింపిక్స్ లో కేవలం 10వేలు మాత్రమే ఇచ్చారు. అథ్లెట్ల సంఖ్య చూస్తే   పారిస్‌లో 10 వేల 500 మంది ఉంటే, ఇక్కడ 3 వేల మందిలోపే ఉన్నారు. సంఖ్య తక్కువైనా డిమాండ్ మాత్రం ఎక్కువగా ఉంది.

ALSO READ : టీ20 వరల్డ్ కప్లో పాక్పై భారత్దే పైచేయి.. 

ఈ అంశంపై లొంబార్డి గవర్నర్ అటిలియో ఫోంటానా స్పందిస్తూ.. ఇందులో ఇబ్బంది పడాల్సింది ఎం లేదని అన్నారు. 1988 సియోల్ ఒలింపిక్స్ నుండి లైంగిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఈ పద్ధతి కొనసాగుతోంది. గతంలో 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా మొదట ఇచ్చిన 70 వేల కండోమ్‌లు అయిపోతే, తరువాత మరో 20 వేలు ఆర్డర్ చేయాల్సి వచ్చిందన్నారు.