T20 World Cup: దంచికొట్టిన స్కాట్లాండ్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతో తెలుసా..?

T20 World Cup: దంచికొట్టిన స్కాట్లాండ్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతో తెలుసా..?

T20 World Cup: టీ20 ప్రపంచకప్ గ్రూప్-సీ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చిన స్కాట్లాండ్ జట్టుకు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. 3 ఓవర్లు ముగిసే సరికి కీలకమైన రెండు వికెట్లు నష్టపోయి కేవలం 18 పరుగులే చేసింది. స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సే 4 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రాండన్ మెక్‌ముల్లెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన కెప్టెన్ రిచీ బెరింగ్టన్ మరో ఓపెనర్ మైఖేల్ జోన్స్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 

దూకుడు మీదున్న మైఖేల్ జోన్స్ ఇంగ్లాండ్ పేసర్ సామ్ కరన్ బౌలింగ్ లో జాకబ్ బెథెల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టామ్ టామ్ బ్రూస్ స్కాట్లాండ్ కెప్టెన్ తో కలిసి ఇన్సింగ్స్ చక్కదిద్దే పనిలో పడగా.. లియామ్ డాసన్ ఔట్ చేసేశాడు. దీంతో ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ కూడా అవుట్ కావడంతో తీవ్ర కష్టాల్లో పడిన జట్టును చివర్లో ఆలివర్ డేవిడ్సన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. 

మరోవైపు, ఇంగ్లాండ్ బౌలర్లు దండయాత్ర చేశారు. క్రమంగా వికెట్లు తీస్తుండటంతో స్కాట్లాండ్ బ్యాటర్లు కొద్దీగా ఇబ్బంది పడిన కూడా 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీసుకోగా, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జేమీ ఓవర్టన్, సామ్ కర్రాన్ తలో వికెట్ పడగొట్టడంతో స్కాట్లాండ్ ఆలౌట్ అయింది.