హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం.. రామోజీ ఫిల్మ్ సిటీలో AR రెహమాన్ ఈవెంట్ ఉండటంతో..

 హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం.. రామోజీ ఫిల్మ్ సిటీలో AR రెహమాన్ ఈవెంట్ ఉండటంతో..

హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. గంటల తరబడి ఎదురు చూసినా వాహనాలు ముందుకు కదలకపోవడంతో వాహనదారలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

శనివారం (నవంబర్ 08) రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈవెంట్ ఉండటంతో అభిమానులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో సిటీలోకి ఎంటరయ్యే రూట్లోనూ.. అదే విధంగా విజయవాడ వెళ్లే రూట్లోనూ భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించి పోయింది. సిటీ నుంచి ఫిల్మ్ సిటీకి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటుండటంతో రెండు వైపులా ట్రాఫిక్ జాం అయ్యింది.  ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.