కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి.. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్కపని చేయలే.. మంత్రి వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి.. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్కపని చేయలే.. మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్:  పదేళ్లలో బీఆర్​ఎస్​చేసిన అభివృద్ధి ఒక్కటి కనిపించలేదు.. కాంగ్రెస్​తోనే జూబ్లీహిల్స్ అభివృద్ది జరుగుతుంది.. కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు మంత్రి వివేక్​ వెంకటస్వామి. 

శనివారం ( నవంబర్​8) షేక్​ పేట్ డివిజన్​ లోని వివేకా నంద నగర్​ కాలనీ వాసులను కలిసిన మంత్రి వివేక్​ వెంకటస్వామి.. జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలోని ప్రాంతాల అభివృద్దిపై కాంగ్రెస్​ దృష్టిపెట్టింది.. మీ సమస్యలు పరిష్కరిస్తాం.. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై గొంతు వినిపించాలంటే కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ ను గెలిపించాలని విజ్ణప్తి చేశారు. జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాకి  దాదాపు 200 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు.జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే నవీన్​యాదవ్​ ను గెలిపించుకుంటే  మరింత అభివృద్ది జరుగుతుందన్నారు మంత్రి వివేక్​ వెంకటస్వామి. 

వివేకానందనగర్​  కాలనీలో సమస్యలపై స్థానికులు వినతి పత్రాలు ఇవ్వగా వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈ కాలనీ వాసులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను  పరిష్కరించాలని మంత్రి వివేక్​ వెంకటస్వామి చెప్పారు. నవంబర్​ 11 న జరిగే ఎన్నికల పోలింగ్​ లో పాల్గొని కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి నవీన్​ యాదవ్​ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను మంత్రి వివేక్​ వెంకటస్వామి కోరారు.