Jhanvi : ఘట్టమనేని వారసురాలి గ్లామర్ షో.. హీరోయిన్‌గా అరంగేట్రానికి ముందే మెరుపులు!

Jhanvi : ఘట్టమనేని వారసురాలి గ్లామర్ షో..  హీరోయిన్‌గా అరంగేట్రానికి ముందే మెరుపులు!

తెలుగు సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసురాలు వెండితెరపై మెరిసేందుకు సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనకోడలు, నటి, నిర్మాత మంజుల కూతురు జాన్వీ స్వరూప్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవలే మంజుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడంతో సినీ వర్గాల్లో, అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

అరంగేట్రానికి ముందే మెరుపులు

జాన్వీ స్వరూప్‌కు నటన కొత్తేమీ కాదు. 2018లో తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ చిత్రానికి మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. పదేళ్ల వయసులోనే కెమెరా ముందు సహజమైన నటనను ప్రదర్శించిన జాన్వీ, ఇప్పుడు హీరోయిన్‌గా రాక కోసం నటన, నృత్యంలో శిక్షణ తీసుకుని తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంది.

ట్రెండీ లుక్స్‌లో.. 

తొలి సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే, జాన్వీ తన టాలెంట్‌ను కెమెరా ముందు ప్రదర్శించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ చేసిన యాడ్స్, ఫోటోషూట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  లేటెస్ట్ గా ఒక యాడ్‌లో ఆమె రాయల్ లెహంగా ధరించి, విలువైన డైమండ్ జ్యువెలరీతో కళ్లు చెదిరేలా కనిపించింది. మరో యాడ్‌లో జాన్వీ చక్కటి ట్రెడిషనల్ పట్టుచీరలో, టెంపుల్ గోల్డ్ జ్యువెలరీతో సాంప్రదాయ సౌందర్యానికి ప్రతీకగా నిలిచింది. రెండు వేరియేషన్లలోనూ జాన్వీ ఎంతో గ్రేస్‌ఫుల్‌గా, ఘట్టమనేని వంశం అందాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆమె మత్తెక్కించే కళ్లు, నాజూకైన రూపం చూస్తే టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అయ్యే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

త్వరలోనే అధికారిక ప్రకటన

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేశ్ బాబు మేనకోడలిగా సినీరంగ ప్రవేశం చేస్తున్న జాన్వీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో, ఆమె తొలి చిత్రానికి సంబంధించిన దర్శకుడు, ప్రొడక్షన్ బ్యానర్ అన్నీ ఇప్పటికే ఖరారు అయినట్లు మంజుల ఇటీవల వెల్లడించారు. కథానాయికగా జాన్వీ డెబ్యూ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. మహేశ్ అభిమానులు జాన్వీని మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుతూ, మంజుల చేసిన భావోద్వేగభరితమైన పోస్ట్ కూడా వైరల్ అయింది. పూర్తిస్థాయి కథానాయికగా వస్తున్న జాన్వీ స్వరూప్‌ సినీ రంగంలో గొప్ప విజయం సాధించాలని ఘట్టమనేని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.