ఎంపికైన కానిస్టేబుళ్లకు వెంటనే శిక్షణ ఇవ్వాలి

ఎంపికైన కానిస్టేబుళ్లకు వెంటనే శిక్షణ ఇవ్వాలి

కానిస్టేబుళ్లుగా నియామక‌మై ఖాళీగా ఉన్న 4,203 మంది తెలంగాణ స్టేట్ స్పెష‌ల్ పోలీస్‌(TSSP)ల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌ని
మాజీ ఎమ్యెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు.

2018 లో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ ప‌రీక్షలు నిర్వహించి 18000 మంది నిరుద్యోలను ఉద్యోగాలకు ఎంపిక చేసింద‌ని, అందులో 4,203 మంది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రీక్యూట్మెంట్ బోర్డు ద్వారా నియామకం అయ్యార‌ని లేఖ‌లో పేర్కొన్నా‌రు వంశీ చంద్ రెడ్డి. వీరు కాకుండా మిగతా 14 వేల మంది ఏ ఆర్, సివిల్ అభ్యర్థులకు మాత్రమే ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని, TSSP పోలీస్ అభ్యర్థులకు మాత్రం ఎటువంటి శిక్షణ కు సంబంధించిన సమాచారం లేదన్నారు.

ఈ కరోనా సమయంలో కూడా CIVIL,AR,SPF, COMMUNICATION,JAIL WARDERS వారికి శిక్షణ ఇస్తున్నారు. కానీ TSSP కానిస్టేబుల్స్ కి శిక్షణ విషయంలో ప్రభుత్వం కానీ,తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానీ పట్టించుకోవడం లేదన్నారు.
ఈ విషయంలో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, శిక్షణ ఒకవేళ ఇంకా ఎక్కువ కాలం ఆలస్యం అయిన పక్షంలో, వారు సర్వీస్ కోల్పోతామనే భయాందోళనలో ఉన్నారని తెలిపారు. అందువల్ల ఈ విషయంలో సీఎం సహృదయంతో స్పందించి తగిన చర్యలు తీసుకొని 4,203 తెలంగాణ బిడ్డలను ఆదుకొని వారికి వెంటనే శిక్షణ ఇప్పించగలరని కోరుతున్నానని వంశీ చంద్ రెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు.