Sobhita Dhulipala: చై అన్నారా.. చాయ్ అన్నారా.. శోభిత లేటెస్ట్ పోస్ట్ మీనింగ్ ఏంటో?

Sobhita Dhulipala: చై అన్నారా.. చాయ్ అన్నారా.. శోభిత లేటెస్ట్ పోస్ట్ మీనింగ్ ఏంటో?

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని తేడా లేకుండా సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. ఇటీవలే ఆమె ఓ హాలీవుడ్‌ సినిమాలోనూ నటించారు. దేవ్ పాటిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ సినిమాలో కీ రోల్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 

అయితే.. గత కొన్ని నెలలుగా శోభిత ధూళిపాళ అక్కినేని హీరో నాగ చైతన్యతో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఆ వార్తలు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్ర‌మంలోనే.. తాజాగా శోభిత పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టులో.. ఐయామ్ నాట్ ఎవ్రీవ‌న్ క‌ప్ ఆఫ్ చాయ్ (chai), అండ్ ద‌ట్స్ ఓకే.. అని రాసుకొచ్చింది. దానికి అర్థం.. నేనంద‌రికీ న‌చ్చ‌క‌పోయినా నాకేం ప‌ర్లేదు.. అని.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita (@sobhitad)

అయితే..  సాధార‌ణంగా ఎవరైనా క‌ప్ ఆఫ్ టీ అని రాస్తారు. కానీ, శోభిత మాత్రం క‌ప్ ఆఫ్ చాయ్ అని రాసింది. చాయ్ అంటే ఇంగ్లీష్ లో Chai అని రాయాల్సి ఉంటుంది. అలాగే దానికి చై అనే అర్థం కూడా వస్తుంది. నాగ చైతన్యని ప్రేమతో చాలా మంది చై అని పిలవడం మనకు తెలుసు. అందుకే.. కొంతమంది నెటిజ‌న్లు నాగ చైత‌న్య‌ను ప్ర‌స్తావిస్తూనే చై అని రాసింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం.. ప్రస్తుతం శోభిత ధూళిపాళ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.